Connect with us

Andhra

CPI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..AITUC అధ్యక్షులు రవీంద్రనాథ్

Published

on

ఆగస్టు నెలలో జరగబోయే సిపిఐ రాష్ట్ర 28 మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పూల సుబ్బయ్య భవన్లో జరిగిన మునిసిపల్ కాంట్రాక్ట్, సానిటరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి హరిబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పి ఆర్ సి జరిగిన తర్వాత జీతాల పెంపుదల జరగనుందని, సానిటరీ వర్కర్లకు 15వేల రూపాయలతో పాటు 6 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వర్కర్లకు 15000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26 వేల ప్రకారం ఇవ్వాలని ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఆగస్టు 20 నుండి 25వ తారీకు వరకు జరగనున్న రాష్ట్ర 28వ మహాసభల కు భారీ సంఖ్యలో హాజరై 23న జరగనున్న మహా ప్రదర్శన, బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ నాయకులు అందే నాసరయ్య, జిల్లా ఎఐటియుసి నాయకులు షేక్ ఖాసిం, ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు యాలూరి వెంకట రెడ్డి, మున్సిపల్ కాంట్రాక్ట్ ,సానిటరీ కార్మికులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.