Connect with us

Andhra

పాలస్తీనా పౌరులను భారత దేశం వెన్ను దన్నుగా నిలబడాలి..MPJ

Published

on

ప్రపంచ దేశాలు ఎంత హెచ్చరిస్తున్న అమెరికా వత్తాసుతో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై నరమేధం సృష్టిస్తునే ఉంది. ఒకవైపు గాజా ను ఖాళీ మైదానంగా చెసి బాంబులు కురిపిస్తునే, మరోవైపు ఆహారం, నీరు పూర్తిగా ఆపి.. ఆకలి చావులకు కారణమైతుంది. ప్రపంచ దేశాల వత్తిడి మేరకు ఆహార సదుపాయాలు కల్పిస్తామని చెప్పి పిలిచి గాజా ప్రజలపై కాల్పులు జరుపుతూ చంపి వేస్తుంది. ప్రస్తుతం రోజు వారిగా ఆకలితో వందలమంది చనిపొతున్న.. నిమ్మకు నీరెత్తినట్లు మాకు దీనికి ఎటువంటి సంబంధం లేనట్లుగా ఇజ్రాయెల్ మీడియాకు తెలుపుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో వేలమంది ఆకలితో చావబోతుతున్నారని తెలిపింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఇజ్రాయేల్ పై వత్తిడి తెచ్చి పాలస్తీనా ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలు, మెడిసిన్ తదితర సౌకర్యాలు కల్పించేలా చెయ్యాలని, అలాగే యుద్ద విరమణ చేసి, పాలస్తీనా ప్రజలకు పూర్తి స్వాతంత్ర్యం కల్పించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోరుతుంది. ఎప్పటినుంచో పాలస్తీనా ప్రజల కోరకు సహాయం చేస్తూ, వారి స్వాతంత్ర్యం కోసం పాటుపడే మన దేశం, ఆ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపాలని యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మస్జిద్ ఎ అమన్ వద్ద పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, మస్జిద్ కమిటీ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.