Connect with us

Andhra

మంచి వార్త వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని తెలుసా?

Published

on

మంచి వార్త అందరికీ సంతోషాన్నిస్తుంది. మంచి వార్త ఉత్సాహాన్ని పెంచుతుంది. మంచి మంచి వార్త కేవలం ఆకట్టుకోవడమే కాదు, అది వార్త వింటే జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.

మంచి వార్తలు చెప్పేవాళ్లకన్నా చెడు వార్తలని ప్రచారం చేసేవాళ్లే ఎక్కువ అని, మీరు అదే దారిన వెళ్లకండి. చెడు వార్తలని ప్రచారం చేసి ఎవరూ ఒక స్నేహితుణ్ణి సంపాదించు కోలేదు, డబ్బు సంపాదించుకోలేదు, దేన్నీ సాధించలేదు.

మంచి వార్తలని మీ కుటుంబ సభ్యులకి చెప్పండి. ఈ రోజు జరిగిన మంచి విషయాలని వాళ్లకి చెప్పండి. మీకు వినోదాన్నీ, ఆనందాన్నీ కలిగించిన విషయాలని గుర్తు చేసుకుని బాధాకరమైన వాటిని కప్పిపెట్టెయ్యండి. మంచి వార్తలని ప్రచారం చెయ్యండి, చెడు వార్తలని ప్రచారం చెయ్యడం నిరుపయోగం. దానివల్ల మీ కుటుంబానికి ఆందోళన, భయం కలగడం తప్ప ఇంకే ప్రయోజనమూ ఉండదు. ప్రతిరోజూ కొంత వెలుగుని ఇంట్లోకి తీసుకురండి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.