Andhra
మార్కాపురం డివిజన్ పరిధిలో.. ఎపి సిపిడిసిఎల్ అధికారుల సమిక్ష..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఏపీ సీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి మరియు ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్ టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, మార్కాపురం డివిజన్ విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మార్కాపూర్ డివిజన్లోని విద్యుత్ అధికారులు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. విద్యుత్ లైన్లు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు నిర్వహించి విద్యుత్ అంతరాయము తగ్గించాలని సూచించారు. మరియు డివిజన్లో 43 కోట్ల ప్రైవేట్ విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. డివిజన్లో 3300 వ్యాపార సర్వీసులకు మరియు 856 గవర్నమెంట్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల బిగింపును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మరియు డివిజన్లో పెండింగ్ లో ఉన్న 1057 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా పూర్తిచేసి రైతులకి సర్వీసులను తొందరగా అందించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశం తర్వాత మార్కాపురం మండలంలో ఇడుపూరు గ్రామంలోని ఇండోర్ సబ్ స్టేషన్ ని సి.ఎం. డి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సబ్ స్టేషన్ ను నెలవారి మరమ్మత్తులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశానికి విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కాపురం పి.వి. నాగేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కాపురం శ్రీ ఎస్. సియా నాయక్ మరియు ఏడిఈ లు వివిధ మండలాల ఏఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
![]()
