Andhra
అఖిల పక్ష సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్..
- ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ అఖిలపక్ష పార్టీలతో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాద్ అధ్యక్షతన మంగళవారం సమాచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్స్ పోలింగ్ బూతుల రేష్నలైజేషన్ గురించి వివరిస్తూ.. ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు ఇకమీదట నుంచి ప్రతి పోలింగ్ బూతు 1200 ఓటర్స్ కు మించకుండా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి తాసిల్దారులు మరియు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు
![]()
