Andhra
ఆటోలో మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించిన అహ్మద్
రావులపాలెం 21, జులై సోమవారం రావులపాలెం ఆటో డ్రైవర్ నిజాయితీకి హాట్సాఫ్,సకాలంలో స్పందించి బ్యాగును యువతీ కు అప్పగించిన రావులపాలెం పోలీసులు.ఉబలంక నుంచి రావులపాలెం వెళుతున్న గుడిమెట్ల మధులత రావులపాలెం వస్తుండగా తన బ్యాగును ఆటోలో మర్చిపోయి దిగి వెళ్లిపోగా కట్టుంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముల్ల అహ్మద్ వలి బ్యాగును గుర్తించి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బ్యాగును ఆటోలో మర్చిపోయిన సదరు మహిళ పోలీస్ స్టేషన్ రాగా ఆమెకు బ్యాగును అప్పగించిన రావులపాలెం పోలిసులు.
వివరాల్లోకి వెళితే… ఓ మహిళ సాయంత్రం 4 గంటలకు ఆటో ఎక్కింది. తర్వాత అనుకోకుండా తన బ్యాగు ఆటోలో వదిలివేసింది. బ్యాగ్‌లో ఆమె ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డెబిట్ కార్డ్‌లు వంటి కీలకమైన పత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా నగదు పది వేలు కూడా ఉంది. బ్యాగ్ పోయిందని గుర్తించిన తర్వాత ఆమెలో టెన్షన్ మొదలైంది. మరింత సహాయం కోరుతూ రావులపాలెం పోలీసులను ఆశ్రయించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అధికారులు ఆటో రిక్షా జాడ కోసం ప్రయత్నించారు. అయితే, ఒక గంట తర్వాత, బ్యాగ్ పోగొట్టుకున్న వారి బ్యాగ్‌తో ముల్ల అహ్మద్ వలి అనే ఆటోడ్రైవర్ తిరిగి వచ్చి పోలీసులు సమాచారం ఇచ్చాడు. బ్యాగ్‌లోని నగదుతో సహా ప్రతి ఒక్క వస్తువు కూడా ఉందని తెలిసి బ్యాగ్ పోగొట్టుకున్న ఆమె ఆనందం వ్యక్తం చేసింది. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని ఆ ఆటోడ్రైవర్ నిదర్శనం అని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు.
![]()
