Connect with us

Andhra

మైనార్టీ సంక్షేమ నిధుల విడుదల చేయండి: కేంద్ర మంత్రి కి ఫరూక్ షిబ్లీ వినతి పత్రం

Published

on

Shot News:ఆంధ్రప్రదేశ్ మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన వివిధ పథకాల అమలుకు అవసరమైన నిధులను (PMJVKY, PM VIKAS, NMFDC) వెంటనే విడుదల చేయాలని కోరుతూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లి ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గతంలో వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీలోని కేంద్ర మైనార్టీ సంక్షేమ మంత్రి కిరణ్ రిజిజును కలిసి అభ్యర్థిస్తూ వినతిపత్రం సమర్పించారు. అలాగే గన్నవరం విమానాశ్రయాన్ని హజ్ ఎంబార్గేషన్ పాయింట్ గా తిరిగి నియమించాలని మరియు తెలంగాణ ,కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో సరి సమానంగా హజ్ యాత్ర ఖర్చు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అలాగే ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరారు.

దీనిలో భాగంగా కేంద్ర మంత్రి రామానాయుడు గారిని, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు లావు కృష్ణ దేవరాయలు, నంద్యాల పార్లిమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, ఏపీ కూటమి భాగస్వామి అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ , మాజీ బీజేపీ అధ్యక్షురాలు మరియు ఎంపీ పురందేశ్వరి, ఏపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తదితరులను కలిసి మైనార్టీ సంక్షేమ నిధుల విడుదల కోసం కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ప్రత్యేకంగా సిఫార్సు చేయమని కోరడం జరిగింది. ఈ విషయంలో వారు సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని ఆయన షాట్ న్యూస్ కు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.