Connect with us

Andhra

కేంద్ర ఇచ్చిన పంచాయతీ నిధులు విడుదల చేయండి: జాస్తి వీరాంజనేయులు

Published

on

*రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసి సహకరించండి*

*గతేడాది డిసెంబర్ లో కేంద్రం పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1,121 కోట్లను తక్షణం విడుదల చేయాలని డిమాండ్*

*గత ఏడు నెలలుగా సర్పంచులు ఎదురుచూపు*

*ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని సర్పంచులు వాపోయారు*

*ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఆంధ్రప్రదేశ్ సర్పంచులు సమర్పించారు*

– గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి కి అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా జిల్లా సర్పంచులు వినతిపత్రం స్పందనలో అందజేశారు .

– రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామపంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని వెంటనే రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని జిల్లా సర్పంచులు కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మీడియా తో మాట్లాడుతూ గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1,121 కోట్ల రూపాయలు ఇంతవరకు పంచాయతీల ఖాతాలో జమ కాకపోవడం విచారకరమన్నారు. కేవలం జీవోలు పరిపాలన అనుమతులు మంజూరు చేసి నిధులు జమ చేయకపోవడం సమంజసం కాదన్నారు ఈ ఆర్థిక సంవత్సరం జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 1,000 కోట్లు రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు గత సంవత్సరం పంపిన నిధులను గ్రామపంచాయతీలు ఖర్చుపెట్టి ఖర్చుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి పంపిస్తేనే మరో వెయ్యి కోట్లు బదిలీ చేస్తామని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఢిల్లీలో కలిసిన నేపథ్యంలో తెలిపినారు గ్రామ పంచాయతీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్ సర్చార్జిని వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధులు లేకపోవడంతో గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా తయారవుతున్నాయని, ప్రస్తుత వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన 1,121 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించేందుకు కృషి చేయాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే సర్పంచుల గౌరవ వేతనాన్ని కూడా విడుదల చేయడంతో పాటు పెంచాలని కోరారు. సర్పంచుల సమస్యలపై కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు కాట్రపాడు సర్పంచ్ మేదరమెట్ల శివశంకర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల సర్ చార్జి సంవత్సర కాలంగా రావట్లేదని తక్షణం గ్రామపంచాయతీలకు రావలసిన సర్ చార్జిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు, మంచాల సర్పంచ్ చందు వెంకట సాంబశివరావు మాట్లాడుతూ సర్పంచుల గౌరవ వేతనాన్ని సకాలంలో విడుదల చేయాలని గౌరవ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మంచాల సర్పంచ్ చందు వెంకట సాంబశివరావు, కాట్రపాడు సర్పంచ్ మేదరమెట్ల శివశంకర్, వెంగలాయపాలెం సర్పంచ్ నల్లపాటి లలిత కుమారి, మేడికొండూరు సర్పంచ్ పూల నాగమణి , జొన్నలగడ్డ సర్పంచ్ మబ్బు శిరీష సుధాకర్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.