Andhra
విమాన ఆదరణ పెరగటంతో.. సర్వీసులు పెంపు..!
ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన సర్వీసులను పెంచుతున్నారు. ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. ఓర్వకల్లు నుంచి విజయవాడకు వారంలో మూడు రోజులు విమాన సర్వీసు నడుస్తుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నంకు కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారితో పాటుగా.. రాష్ట్రంలోనే ఒకచోట నుంచి మరో చోటకు విమానంలో వెళ్లే వారి సంఖ్య కూడా అధికమవుతూ వస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కడప ఎయిపోర్టులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన సర్వీసులను పెంచుతున్నారు. ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. ఓర్వకల్లు నుంచి విజయవాడకు వారంలో మూడు రోజులు విమాన సర్వీసు నడుస్తుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నంకు కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారితో పాటుగా.. రాష్ట్రంలోనే ఒకచోట నుంచి మరో చోటకు విమానంలో వెళ్లే వారి సంఖ్య కూడా అధికమవుతూ వస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కడప ఎయిపోర్టులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
![]()
