Andhra
దొనకొండకు మహార్ధశ.. మిసైల్ తయారీ యూనిట్..?
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతానికి మహార్ధశ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దొనకొండ ఏరియాలో 100 ఎకరాల్లో క్షిపణి (మిసైల్) తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. DRDA అధికారులు ఆదివారం దొనకొండ ఏరియాలో పర్యటించారు. కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ ఛైర్మన్ మదన్మోహన్ దగ్గరుండి దొనకొండలోని ప్రభుత్వ భూములను చూపించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్ పోర్టు, రన్ వే గురించి DRDA అధికారులు ఆరా తీశారు. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ తయారీకి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.
![]()
