Connect with us

Andhra

వర్సిటీ డిప్లమో ఫొటోగ్రఫీ విద్యార్థికి అమెరికా పురస్కారం..

Published

on

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ‘జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్’ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న డిప్లమో ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు విద్యార్థి పొలిబోయిన కృష్ణమూర్తికి ఫోటోగ్రఫీ రంగంలో అమెరికన్ పురస్కారం లభించింది. ప్రపంచంలో పేరు గాంచిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ యుఎస్ఏ సంస్థ ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాలపై ప్రతిభ చూపిన ఫోటోగ్రాఫర్ లకు ఈ పురస్కారాలు అందజేస్తుంది. ఈ ఏడాది మార్చి నెలలో ఫోటోగ్రఫీ విద్యార్థి కృష్ణమూర్తి ఒరిస్సాలోని అతి మారుమూల కొండకోనల్లో నివశించే బోండ గిరిజనుల జీవనశైలిపై పంపిన 12 చిత్రాలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ టోనీలీ బుధవారం మెయిల్ పంపించారు. ఈ మేరకు శుక్రవారం వర్సిటీలో కృష్ణమూర్తిని వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య కె.రత్న షీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలంలతో పాటు జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ జ్యోతిర్మయి అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.