Connect with us

Andhra

మార్కాపురం బస్టాండ్‌లో క్యాంటీన్ ధరలపై కలెక్టర్ సీరియస్..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ తమీమ్ అన్సారీయా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కూడా ఉన్నారు. తనిఖీల సందర్భంగా బస్టాండ్ పరిసరాలలో అపరిశుభ్రత, ప్రయాణికులకు సరైన సౌకర్యాలు లేకపోవడం చూసి కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేస్తున్న విషయాన్ని గమనించి, క్యాంటీన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు నిబంధనలను పాటించడం లేదని వ్యాఖ్యానించిన కలెక్టర్, అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు మెరుగైన సేవలు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.