Andhra
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి డోలా..
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇటీవల మరుగునపడిన ఐసీయూ (ICU) విభాగాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ విభాగాన్ని మరియు థైరాయిడ్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక మెషిన్‌ను రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్ల కొరతపై చర్చ జరిగింది. డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకున్నారు. ఈ సమస్యలను తాము, కలెక్టర్ తో కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారాలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్లే చెరువు గట్టు రహదారి గుంతల మయం అయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని మంత్రి గారిని ప్రజలు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి గారు రోడ్లు, భవనాల శాఖ (R&B) అధికారులతో మాట్లాడి త్వరితగతిన రహదారిని మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కూరగాయల మార్కెట్ ను సందర్శించి ప్లాస్టిక్ కవర్ల గురించి వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. అలాగే మార్కాపురం బోడపాడులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
![]()
