Connect with us

Andhra

వైసిపి మైనారిటీ రాష్ట్ర కార్యదర్శిగా పెద్ద మస్తాన్..

Published

on

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తర్లుపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, కేతగుడిపి సర్పంచ్ పెద్ద మస్తాన్ ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి, సీనియర్ రాజకీయ నాయకులు, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి గార్లను కలసి ఘనంగా సన్మానించిన పెద్ద మస్తాన్. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ ఇన్చార్జి కారుమూరి నాగేశ్వర రావు తదితరులకు పెద్ద మస్తాన్ ధన్య వాదములు తెలిపారు. పెద్ద మస్తాన్ పదవి వచ్చినందుకు అతని బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.