Andhra
పొగొట్టుకున్న బ్యాగ్ ను గుర్తించి ఇచ్చిన పోలీసులు..
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ షేక్ కరిముల్లాకు ఈనెల 16వ తేదీన రాత్రి సమయంలో కంభం రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి దగ్గర గల హోటల్ లో ఒక బ్యాగ్ దొరకగా, దానిని మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడమైనది. పట్టణ ఎస్ఐ సైదుబాబు బ్యాగ్ ని పరిశీలించి.. విచారణ జరిపి మార్కాపురం పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వెనుక వైపు నివాసం నివాసం ఉంటున్న షేక్ మహమ్మద్ రఫీ, Ex-ఆర్మీ అనునతనివిగా గుర్తించి తన బ్యాగ్ ను నేడు అతని భార్యకు ఎస్ఐ లు పి సైదుబాబు, డాక్టర్ రాజమోహన్ రావులు అప్పగించారు. దీంతో ఆ మహిళ కౌన్సిలర్ డి కరీముల్లా, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
![]()
