Connect with us

Andhra

అక్రమాలకు పాల్పడిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల HM పై చర్యలు తీసుకోవాలి… విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం బాలికోన్నత ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ సక్రమంగా అమలు చేయడంలేదని విద్యా కమిటీ ఛైర్మన్ పఠాన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు. గుడ్డు 3 రూపాయలు, బియ్యం KG 7 రూపాయలకు అమ్ముకుంటున్నారని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకువాలని అన్నారు. ఈ సందర్భంగా నేడు సోమవారం పాఠశాలను సందర్శించి రికార్డులు పరీశిలించారు పఠాన్ నాగూర్ ఖాన్. 802 మందికి మధ్యాహ్న భోజనం వండటానికి 120 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 70 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. నెలకు రెండు లక్షల రూపాయలు అక్రమ సంపాదన సంపిదిస్తున్నందున ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.