Andhra
పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలి.. రెహానా భాను
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని ఇవ్వకుండా రాత్రి పూట బ్లాక్ లో అమ్ముకొని పందికొక్కుల్లా మింగుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ రెహానా భాను దుయ్యబట్టారు. ఒకే షాపుకి ఇద్దరు ముగ్గురు డీలర్లను ఏర్పాటు చేసుకొని ఒకరి మీద ఒకరు సరుకు లేదని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా రాత్రి పూట నల్లబజారుకు తరలిస్తున్నారని, మరికొందరు రేషన్ డీలర్లు మరీ ముందుకెళ్ళి ఇంటింటికీ వెళ్లి బియ్యానికి బదులు డబ్బులు ఇస్తూ..బ్లాక్ మార్కెట్ కు తరలించడం దారుణమని, రెవిన్యూ అధికారులు వారికి కొమ్ము కాయకుండా వెంటనే జ్యోక్యం చేసుకొని ఈ దోపిడిని అరికట్టి, వారి డీలర్ షిప్ లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తు మా కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని పత్రికా ముఖంగా తెలిపారు.
![]()
