Andhra
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తిప్పయపాలెం- జంగంగుట్ల మధ్య నిన్న రాత్రి కారు గేదేను తప్పించె క్రమంలో బైక్ ను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు చనిపోయారు. అర్ధవీడు మండలం బొల్లుపల్లెకు చెందిన దావీదు(45), రంగాపురానికి చెందిన విజయ్(25) లుగా గుర్తించారు. ఆ తర్వాత కూడా రోడ్డుపై చనిపోయి అడ్డంగా ఉన్న గేదెను తప్పించె క్రమంలో మరో రెండు కార్లు స్వల్పగాయాలతో బయట పడ్డారని సమాచారం. ఇప్పటికే ఈ రోడ్డుపై చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నందున ఈ రోడ్డుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు.
![]()
