Andhra
మార్కాపురంలో దొంగతనాల జోరు..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దొంగల హడావుడి ఎక్కువైంది. శుక్రవారం తెల్లవారుజామున ఒక్క రోజే దాదాపు పదిమంది సెల్ ఫోన్లను ఇండ్లలోకి వచ్చి దొంగిలించారని సమాచారం. ఇదే గాక నేడు స్టేషన్ కూతవేటు దూరంలో ఒక పండ్ల వ్యాపారి దగ్గర యాభై వేల రూపాయలు చేతివాటం చూపించారు దొంగలు. దీంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు రాకపోవడం గమనార్హం. పోలీసులు ప్రతి రోజూ రాత్రిపూట పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. అయిన దొంగలు తమ పని తాము కానిస్తున్నారు. నిఘా వ్యవస్థను పెంచి దొంగలు బారి నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
![]()
