Connect with us

Andhra

దేశం కోసం మధ్యవర్తిత్వంపై అవగాహన..మండలం న్యాయ సేవాధికర సంస్థ

Published

on

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశముల ప్రకారం (దేశం కోసం మధ్యవర్తిత్వం) అవగాహన వారోత్సవాలలో భాగంగా ఈరోజు మార్కాపూర్ కోర్టుల ప్రాంగణం నందు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో న్యాయపరమైన అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ‘స్టాల్ ‘ ను మార్కాపురం అడిషన్ జూనియర్ సివిల్ జర్జీ యం. బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కోర్టు కేసులు త్వరగా పరిష్కరించుకోవటం కోసం మధ్యవర్తిత్వమునకు చాలా ప్రాధాన్యత ఏర్పడినదని ,మార్కాపూర్ కోర్టు నందు యుసఫ్ అలీ అలీ. హరికృష్ణ. మహబూబ్ వళి. శివ శంకర్ రెడ్డి.లు ఇరు పార్టీలతో సమన్వయమును ఏర్పరచడంతో పాటు మధ్యవర్తులు పోషించవలసిన పాత్రను తెలియజేశారు. కావున కక్షిదారులు ఈ అవకాశమును మధ్యవర్తిత్వం ద్వారా తమ కోర్టు కేసులకు ఉపయోగించుకోవలసినదిగా జడ్జి లు తెలియజేశారు .ఈ సందర్భంగా ” 1 – k Walk” కూడా నిర్వహించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.