Andhra
నాగార్జున సాగర్ కు భారీ వరద నీరు..
శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోవడంతో అక్కడ నుండి వస్తున్న వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,18,167 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 5,612 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 543.60 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 195.9102 టీఎంసీలు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
![]()
