Andhra
ఏలూరు లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
ఏలూరు జిల్లా :మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ పిటీఎం 2.0 నేడు ఏలూరు తంగేళ్లముడి దర్స్గాఇస్లామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్కూల్లో ట్రెజరర్ మొహమ్మద్ కలీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయంతో మరింత చురుగ్గా విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడాలని కోరారు. ప్రిన్సిపల్ చంద్రన్ ఈ స్కూల్లో 70 శాతం పిల్లలకు 13వేల రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయని మిగతా రానివ్వరు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ సభ్యులు షేక్ ఇసాక్, షేక్ సైద్, పూర్వపు విద్యార్థి ఎండి మేహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
![]()
