Andhra
విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించిన పోలీసులు..
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని సాధన జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమంలో SDPO మార్కాపూర్, CI మార్కాపూర్ మరియు SI మార్కాపూర్ కళాశాల యజమాన్యం పాల్గోనటం జరిగింది. కళాశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనార్ధాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మరియు డయల్ 100/112 సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ముఖ్యంగా విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలుసుకోవడం మరియు స్వీయ రక్షణ, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసలపట్ల మరియు చట్టాలపై, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు/మహిళలు/యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, విద్య మరియు భవిష్యత్తు గురించి వివరించారు. వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని వారు సూచించారు. ఒకసారి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదయ్యితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, విద్యార్థులు క్రమ శిక్షణతో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. మీకు ఎవరికైనా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, రహదారులపై హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించడం, మైనర్ లు వాహనం నడపకూడదని తెలియచేసారు. క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి.విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి, చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు.
ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయం పొందాలంటే అటువంటి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ – 100/112 కు కాల్ చేయడం ద్వారా సత్వర సహాయం అందుతుందని తెలిపారు.

![]()