Andhra
సబ్ జైలును తనిఖీ చేసిన జడ్జి.. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఖైదీలకు హితవు
∞ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సబ్ జైలును అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యం. బాలాజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణ ఖైదీలను మరియు కేసులలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరములను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేవుడు ఇచ్చిన మానవ జన్మ ను మంచి- చెడును గ్రహించే విచక్షణ జ్ఞానం మనుషులు కలిగి ఉండాలని, కుటుంబ సభ్యుల మధ్య స త్సంబంధాలు ఉండాలని, అవి కొరవడిన నాడు మానవ సంబంధాలు మరియు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైనప్పుడు సమాజంలో శాంతి ఉండదన్నారు. .మనుషులు ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నిగ్రహం నశించి నేరాలకు పాల్పడుతున్నారని, తద్వారా కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు చట్టాలను అతిక్రమించకూడదన్నారు. మత్తు పదార్థాలను వాడిన యువత ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసుకోవడమే కాక కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారని, ఇంద్రియ నిగ్రహం లేక నేరాలకు పాల్పడుతున్నారన్నారని, చేసిన తప్పులకు పశ్చాతాపం చెంది ,చెడు అలవాట్లను వీడి పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. బెయిలు, అరెస్టు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలను, వారికి అందుతున్న ఆహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నందు సబ్ జైల్ సూపరెండేంట్, కోర్ట్ సిబ్బంది, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
