Connect with us

Andhra

ఈ రోజు సమ్మెకు APWJS సంఘీభావం ..

Published

on

దేశవ్యాప్తంగా ఈ రోజు జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య సంపూర్ణ సంఘీభావం తెలిపింది.వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నాం అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి తెలిపారు. సమ్మెలో తమ సమస్త సభ్యులు భాగస్వాములమవుతున్నాం అని,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య జిల్లా శాఖలు జూలై 9న అన్ని జిల్లా కేంద్రాలలో కేంద్ర కార్మిక సంఘాలతో పాటు జరిగే ఆందోళనలో పాల్గొనాలని కోరుతున్నాం. కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించే ధర్నాలు ప్రదర్శనలు ఇతర ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం ద్వారా కార్మిక ఐక్యతను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.జర్నలిస్టులకున్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టం వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను నిలబెట్టుకోగలమని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.