Andhra
రైతులు దూరదృష్టితో మామిడి మొక్కలను నాటి-ఆదాయం పొందండి.. ఎమ్మెల్యే కందుల
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మామిడి మొక్కలను రైతుల కలిసి పొలాలలో నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో రైతులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మొక్కలలో దానిమ్మ,బత్తాయి మరియు సీతాఫలం మొక్కల్ని నాటారని కానీ ఇక్కడి గ్రామాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవి ఫలాలను ఇవ్వడం లేదని అందుకే దూర దృష్టితో ప్రతి ఒక్కరూ మామిడి మొక్కలను తమ పొలాలలో నాటాలని తద్వారా నాలుగు సంవత్సరాల తర్వాత ఫల సాయం ద్వారా దాదాపు 40 సంవత్సరాలు వరకు ఆదాయం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మామిడి మొక్కలను రైతులు నాటాలని సూచించారు. అనంతరం జమ్మనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబోధన నేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఎదుగుతున్నాయని ఉపాధ్యాయులు కూడా తమ సమయాన్ని ఎక్కువ వెచ్చించి విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జమ్మలపల్లి గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
![]()
