Andhra
వైసిపి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సంధర్బంగా మార్కాపురం పట్టణంలోని గడియార స్థంభం వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మార్కాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి అన్నా రాంబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్సార్ ముఖ్యమంత్రి కాక ముందు పరిస్థితులు, అయిన తర్వాత ప్రజల అవసరార్థం అయన తెచ్చిన సంక్షేమ పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ గృహాల నిర్మాణం తదితర పధకాలను తెచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందని, అలాగే అదే బాటలో ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజల కొరకు మరిన్ని సంక్షేమ పధకాలను ఇచ్చారని, ప్రజలు వాస్తవాలు తెలుసుకుని వైయస్సార్ పార్టీని జీవించాలని అన్నా రాంబాబు కోరారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
