Connect with us

Andhra

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి..

Published

on

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలను మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పట్టణ గడియార స్థంభం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు‌. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 కిలో 2 బియ్యం పధకం మరియు ఫీజు రియంబర్స్, ముస్లిమ్స్ కు 4% రిజర్వేషన్, పేద వాళ్లకు ఇందిరమ్మ గృహాలు తదితర ఎన్నో పధకాలు ప్రెవశపెట్టిన మహానుభావుడని ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాద శక్తులు తరిమికోట్టాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని అలాగే రాష్టంలో షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాని, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ వలి, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్ మరియు తర్లుపాడు పట్టణ అధ్యక్షులు హుస్సన్, యూసుఫ్ తదితరులు పాలొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.