Connect with us

Andhra

డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Published

on

పిడుగురాళ్ల…. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సేవా వారోత్సవాల సందర్భంగా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల 23వ వార్డు ఎస్టీ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జూలకంటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూలకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లాంగ్ నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగము అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ స్కూల్ విద్యార్థులకు లాంగ్ నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.డాక్టర్ అశోక్ కుమార్ ప్రసంగిస్తూ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించారని, వైద్యము విద్య అందుబాటులో ఉండేలా చేశారని, 104 వాహనాలు ఏర్పాటు చేసి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడారని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యానికి విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్లకి ధీటుగా అభివృద్ధి చేసి, నాడు- నేడు పథకం ద్వారా స్కూలుకు నాణ్యమైన ఫర్నిచర్ అందించడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన టెస్టు పుస్తకాలు బాగ్స్ తదితర వస్తు సామాగ్రి అందించారని అమ్మ ఒడి పథకం ద్వారా 15 వేల రూపాయలు అందజేశారని తెలిపారు..ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ మున్సిపల్ విభాగం అధ్యక్షులు, పిడుగురాళ్ల మున్సిపాలిటీ జెసిఎస్ ఇంచార్జ్ డా. జూలకంటి శ్రీనివాసరావు , స్కూల్ హెడ్మాస్టర్ ప్రసాద్, ఆర్యవైశ్య నాయకులు సినీ నిర్మాత పార్టీ నాయకులు జీవీ సుబ్బయ్య, పట్టణ ఆర్య సంఘం కోశాధికారి ఆలేటి కనకయ్య , 23 వార్డు పెద్దలు బత్తుల వెంకయ్య , దేవర శీను , నడిగడ్డ శీను , దేవరశెట్టి సురేష్ , షేక్ ఖాసిం, షేక్ నజీర్, వీరయ్య , అంగడి నాగరాజు గారు, బత్తుల వెంకటేశ్వర్లు ,చల్లా అంకమ్మరావు, స్కూలు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.