Andhra
వైసిపి ఇన్చార్జి అన్నాకు కృతజ్ఞతలు తెలిపిన బట్టగిరి..
- రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రెటరీగా నియమితులైన బట్టగిరి తిరుపతి రెడ్డి సోమవారం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి అన్నా రాంబాబును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు బట్టగిరి తిరుపతి రెడ్డి పూల మాల వేసి సన్మానించారు. అనంతరం బట్టగిరి మాట్లాడుతూ.. తనను రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గా నియమించేందుకు కృషి చేసిన అన్నా రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో అభిమానం, నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పజెప్పిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఋణ పడి ఉంటానని, అలాగే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
