Andhra
అడ్వకేట్ రిజ్వాన్ ను ఘనంగా సన్మానించిన ఏపీడబ్ల్యూజేఎస్
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాజీ సంఘం జనరల్ సెక్రటరీ అడ్వకేట్ షేక్ రిజ్వాన్ను ఏపీ డబ్ల్యూ జే ఎస్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీడబ్ల్యూఎస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్లు ఈ రోజు ఆయన ఆఫీసు నందు రిజ్వాన్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తామని షాట్ న్యూస్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు
![]()
