Andhra
స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా CPI నిరసన..
ప్రకాశం జిల్లా ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ లో స్మార్ట్ మీటర్లను ప్రజల ఇళ్లకు బిగించే విధానాన్ని నిరసన తెలియజేస్తూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గౌతం అదాని ఇతర ప్రైవేటు సంస్థలతో చేసుకున్న అవినీతి కరెంటు ఒప్పందాలను వెంటనే నిలిపివేయాలని, ఆ ఒప్పందాల అమలును నిలిపివేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ M L నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ వెంకట్రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తకోట వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ శ్రీరామ్ శ్రీనివాసరావు, ఇన్సాఫ్ నాయకులు కామ్రేడ్ M A. సాలార్, కామ్రేడ్ గౌస్ ఖాన్, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు కామ్రేడ్ సుబ్బయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
![]()
