Connect with us

Andhra

జడ్జిని లక్ష్యంగా చేసుకొని సామజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

Published

on

అమరావతి : ఒక కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డిని సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేయడాన్ని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జగన్‌ పర్యటన సందర్భంగా కారు కింద ఒక వ్యక్తి పడి మరణించిన కేసు విచారణపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీ తర్వాత జడ్జిని లక్ష్యంగా చేసుకొని సామజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరిగిందని అసోసియేషన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే న్యాయమూర్తులను అపఖ్యాతిపాలు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని అభిప్రాయపడింది. ఇందుకు కారణమైన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రకటన విడుదల చేసిన వారిలో హెకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె చిదంబరం, ఉపాధ్యక్షులు కెవి రఘువీర్‌, ప్రధాన కార్యదర్శి సి సుభోద్‌ ఉన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.