Andhra
ప్రకాశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీ.ఎం కొణిజేటి రోశయ్య గారి జన్మదిన వేడుకలు..
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి.రోశయ్య గారి 93వ జన్మదిన కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి ప్రెసిడెంట్ షేక్ సైదా పాల్గొన్నారు. డిసిసి ప్రెసిడెంట్ షేక్ సైదా మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య గారు 16 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మహనీయుడని షేక్ సైదా అన్నారు.ఆయన రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన అలుపెరగని కృషి చేశారని గుర్తు చేశారు. కోనసీమకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు, నెల్లూరుకు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు, కడపకు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు, కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ గారి పేరు, ఎలా నామకరణం చేశారో, వేమూరులో జన్మించిన మహనీయుడు కొణిజేటి రోశయ్య గారి పేరు బాపట్ల జిల్లాకు నామకరణం చేయాలని షేక్ సైదా డిమాండ్ చేశారు. ఒంగోలు బాబుజీ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన కొనిజేటి రోశయ్య విగ్రహం దగ్గర ఉన్న వాటర్ ఫౌంటెన్, లైటింగ్ ను తొలగించడం దుర్మార్గమని, వెంటనే విగ్రహం వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున కొణిజేటి రోశయ్య గారి అభిమాన సంఘంతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఉద్యమం చేపడతామని షేక్ సైదా అన్నారు. కొనిజేటి రోశయ్య గారి జన్మదినo, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా కొణిజేటి రోశయ్య గారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొణిజేటి రోశయ్య గారి విగ్రహం వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్ లైటింగ్ ను తొలగించిన కారణంగా పొట్టి శ్రీరాములు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగాంజనేయులు కొణిజేటి రోశయ్య గారి విగ్రహం వద్ద చేస్తున్న మౌన దీక్షకు డిసిసి అధ్యక్షులు షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావం తెలిపి కొంతసేపు ఆయనతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు, దర్శి ఇంచార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి, డిసిసి వైస్ ప్రెసిడెంట్ గోరంట్ల కోటేశ్వరరావు ,సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు, అసంఘటిత కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలగతోటి సుధీర్ వర్మ, డిసిసి జనరల్ సెక్రటరీ ఇరిగినేని వెంకట నరసయ్య, మాజీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, మైనారిటీ జిల్లా ప్రధానకార్యదర్శి షేక్. మహబూబ్ వలి, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఈమని కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వత్సవాయి. శ్రీనివాసరాజు, కందుల. కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.
![]()
