Connect with us

Andhra

జలజీవన్ స్కీం పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్..

Published

on

ఉప ముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించెందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 శాతం వాటాతో నిధులతో.. జల జీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా రూ.1290 కోట్లతో పనులకు సంభందించిన పైలాన్ ను పట్టణ పొలిమేర అయిన నరసింహపురంలో (ఇందిరమ్మ కాలనీ) డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పలు విషయాల గురించి ప్రసంగించారు. తదనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎం.పీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు జిల్లా ఎమ్మెల్యేలు, జనసేన స్థానిక ఇంఛార్జి ఇమ్మడి కాశీనాథ్, ఇతర ఇంఛార్జిలు, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు విరివిగా పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.