Andhra
ఎమ్మెల్యే నసీర్ సేవలపై ప్రజల సంతృప్తి
కూటమి సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల ముంగిటకు వచ్చిన ప్రజాప్రతినిధులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడాది కాలంలో తమ ఇంటికే సంక్షేమాన్ని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ ను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు మనసారా ఆశీర్వదిస్తున్నారు. తల్లికి వందనంతో తమ బిడ్డల బాటలు పరిచారని సంబరపడుతున్నారు.. చేసుపరిపాలన- మన ఎమ్మెల్యే తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్లో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఈస్ట్ అబ్జర్వర్ ఆంజనేయులు, మద్దిరాల మ్యాని, రాజా మాస్టర్, చిట్టాబత్తిని చిట్టిబాబుతో కలిసి ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి తమ పరిపాలన ఏడాది ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడాది ప్రోగ్రెస్ సూపర్ సక్సెస్ గా ఉందని ప్రజలు కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ చెప్పిన మాట చెప్పిన విధంగా సంక్షేమ అభివృద్ధి, పథకాలను అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచి ప్రతి నెలా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్న ప్రభుత్వాన్ని అవ్వ తాతలు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఏ ఒక్కరు బాధపడకూడదని కృత నిత్యంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 200 మందికి రూ.2.50 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల ద్వారా భరోసా కల్పించామని తెలిపారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి వందల కోట్లతో పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యను అభ్యసించే ఓ విద్యార్థి ఎమ్మెల్యే నసీర్ వద్దకు వచ్చి తన చదువుకు సహకరించాలని కోరగా ఆమెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు..
![]()
