Connect with us

Andhra

ఏపీడబ్ల్యూజేఎస్ గుంటూరు జిల్లా లీగల్ అడ్వైజర్ గా అడ్వకేట్ షేక్ రిజ్వాన్

Published

on

జర్నలిస్టుల సమస్యల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య. ఈ యూనియన్ తమ యూనియన్ లోని జర్నలిస్టులోనే కాకుండా మిగతా జర్నలిస్టులకు కూడా అండగా నిలబడుతుంది. కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులందరి పై ఎవరు బెదిరించిన, దాడి చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవల జరిగిన సభలోయూనియన్ నాయకులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు గుంటూరు జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ గా గుంటూరుకు చెందిన అడ్వకేట్ హఫీజ్ షేక్ రిజ్వాన్ ను నియమించటం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు కాటా రామారావు ఒక ప్రకటన తెలియజేశారు. ఆయన ఎన్నిక పట్ల క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు లాయర్ ఇస్మాయిల్,ఆయుబ్,హుస్సేన్, టోపీ బాబు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.