Andhra
కేర్ వెల్ హాస్పిటల్ లో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు.
గుంటూరు నగరంలో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అందరి మన్నలను పొంది 3 వ వార్షికోత్సవం మరియు డార్టర్స్ డే సందర్భంగా కేర్ నెల్ హాస్పిటల్ నందు ఉచిత ఓపి సేవలు మరియు అన్ని రకాల వైద్య పరీక్షలపై ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ షేక్ నాగూర్ భాష తెలియజేశారు. 3 వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో కార్యక్రమంలో డాక్టర్ షేక్ నాగూర్ భాష మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సమాజంలోని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరం క్రితం డాక్టర్స్ డే రోజు గుంటూరు నగరంలో కేర్ వెల్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి ఇప్పటివరకు హాస్పటల్ నందు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరిగింది అని, ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరిగిందని డాక్టర్ నాగుర్ బాషా తెలిపారు. ఈ 3 వార్షికోత్సవం మరియు డాక్టర్స్ చే సందర్భంగా ఓపి మరియు అన్ని రకాల వైద్య పరీక్షలకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హాస్పిటల్ ప్రారంభించిన దగ్గర నుండి అనేక ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరిగిందని అంతేకాకుండా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కేర్ వెల్ హాస్పిటల్ నందు E.NT , కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీకి సంబంధించిన ప్రముఖ డాక్టర్లచే వైద్య సేవలను అందించటం జరుగుతుందని అన్ని రకాల అత్యవసర కేసులకు సంబంధించి 24 గంటలు అత్యవసర అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రముఖ డాక్టర్లచే లివర్ అండ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎముకలు మరియు కీళ్ల మార్పిడి వైద్య సేవలు, చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వైద్య సేవలను గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కేర్ వెల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ గౌస్ భాషా తెలియజేశారు.
![]()
