Connect with us

Andhra

ఖమ్మంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ సభ

Published

on

ఖమ్మం: లంబాడి హక్కుల పోరాట సమితి  ( ఎల్ హెచ్ పి ఎస్ )  1997 జులై ఒకటవ తేదీన ఆవిర్భవించిందని సామాజిక ఉద్యమకారులు, పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. తెలంగాణ మహాజన ఉద్యమ నిర్మాత, సామాజిక ఉద్యమ సూర్యుడు మారోజు వీరన్న సూచన సలహాల నేపద్యంలో ఆవిర్భవించిన ఈ సంఘం ఇప్పటికీ 28 వసంతాలు పూర్తి చేసుకొని 29వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఖమ్మం నగరం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే ప్రాంగణం పేవిలియన్ గ్రౌండ్ వద్ద కామ్రేడ్ మారోజు వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ బద్రు నాయక్, ఎంపీజే ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం, ఎంపీజే జిల్లా కోశాధికారి ఎండి అబ్దుల్ హకిం, సభ్యులు అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.