Andhra
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు బిక్షాటన..
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా 4వ రోజు కూడా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన కొనసాగించారు. నేడు మార్కాపురం మున్సిపాలిటీ నుంచి పట్టణంలో కలియ తిరుగుతూ ..వినూత్నంగా బిక్షాటన చేస్తూ ఆందోళన చేపట్టారు. “జీతాలు పెంచకపోతే బిక్షమెత్తాల్సిన స్థితి” అని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. “జూలై 4వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకపోతే మంచినీటి సరఫరా ఆపేస్తాం” అని కార్మికులు హెచ్చరించారు.
![]()
