Connect with us

Andhra

ఈనెల 27వ తేదీ కాకినాడలో ఎంపీజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Published

on

కాకినాడ: ఈనెల 27వ తేదీ కాకినాడలో ఎంపీజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు కాకినాడ ఎంపీజే సభ్యులు తెలియజేశారు. ఈ సమావేశం అల్ఫలా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ హాల్ లో ఎం.పి.జె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హుస్సేన్ మరియు జిల్లా అధ్యక్షులు హలీమ్ ఆధ్వర్యంలో ఎం.పి.జె ఏడు జిల్లాల యూనిట్ల అధిపతుల సమావేశం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి, కాకినాడ, మండపేట, రాజోల్, ముమ్మిడివరం, ర్యాలీ, రావులపాలెం, రాజమండ్రి నుండి మొత్తం ఏడు జిల్లాల నుండి 20 మంది అధిపతులు హాజరై ఈ నెల అనగా 27.07.2025 ఆదివారం కాకినాడలో జరగబోవు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురించి పలు విషయాలు చర్చించి ముఖ్యంగా రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర సమావేశం కోసం చేయవలసిన పనుల గురించి చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో, రాష్ట్ర కోశాధికారి షేక్ వలియా ఎం.పి.జె పాలసీ గురించి వివరించారు.ఈ సమావేశానికి దూర ప్రదేశాల నుండి హాజరైన జిల్లా అధిపతులకు, సమావేశం విజయవంతం అయ్యేలా సహకరించిన కాకినాడ జిల్లా అధిపతులకు, తదితరులకు అధ్యక్షులు హలీమ్ కృతజ్ఞతలు తెలిపినారు.

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.