Andhra
రేపే గుంటూరులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర సమావేశం
- జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర సమావేశం గుంటూరులో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరగబోతుంది. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎస్ సంబంధించిన అన్ని జిల్లా కమిటీల సీనియర్ జర్నలిస్టులు,మేధావులు, ఈ సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల హక్కుల కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపొందించి పోరాట దిశగా ముందుకు సాగాలని ఈ సమావేశంలో పిలుపునివ్వడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సమావేశం అనంతరం జర్నలిస్టులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, వారిలో జర్నలిజం విలువలు పెంపొందించడానికి జర్నలిస్టుల శిక్షణ సమావేశాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే తమ సంస్థల్లో చేరవచ్చు అని, వారికి సంస్థ అండగా ఉంటుందని, గుంటూరులోనీ ఫ్యాన్సీ కళ్యాణ మండపం నందు జూన్ 29వ తేదీ ఆదివారం 10 గంటలకు రాష్ట్ర సమావేశం జరుగుతుంది అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
![]()
