Connect with us

Andhra

మాదకద్రవ్య రహిత సమాజం కోసం ముందడుగు

Published

on

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నల్లచెరువులోని మోడల్ ప్రైమరీ స్కూల్ ఈరోజు ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమక్షంలో “మాదకద్రవ్య ముక్త భారత్” అభియాన్ కింద మాదకద్రవ్య రహితంగా ఉండేందుకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చిన్నతనం నుండే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి పునాది వేయడమే లక్ష్యమని స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ దరియావలి పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞ తమతోనే ప్రారంభమై, కుటుంబం, స్నేహితులు, సమాజం మరియు దేశవ్యాప్తంగా విస్తరించాలని విద్యార్థులు సంకల్పించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.