Connect with us

Andhra

కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో దౌర్జన్యంగా ప్రహరీ కట్టడానిక  గుండాలతో ప్రయత్నం

Published

on

ఏలూరు జిల్లా:సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ షుకూర్  ఇంటి స్థలం వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్న నేడు రాజనాల సాయికిరణ్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రహరీ కట్టడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఇదేమిటని బాధితులు ప్రశ్నించగా  మీకు దిక్కున చోట చెప్పుకోమని పరుష పదజాలంతో బూతు పురాణం ఎత్తుకున్నాడు  . 1500  గజాల స్థలం కొరకు 1979 నుండి వివిధ కోర్టులో కేసు నడిచింది.మార్గాన్ని కిరణ్ అనే వ్యక్తి ప్రోత్సాహంతో రాజనాల సాయికిరణ్ 2021లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ప్రహరీ, బాత్రూం, లెట్రిన్, మంచినీటి కులాయి జెసిబి తో పగలగొట్టారు. అప్పుడు అబ్దుల్ షుకూర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా   ఎఫ్ఐఆర్ నెంబర్ 851/ 2021 సీసీ నెంబర్ 216/ 2023 కోర్టులో కేసు నడుస్తుంది. సిఆర్పిసి 145 ప్రోసిడింగ్స్ ఎంఆర్ఓ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ  తెలుపుతున్నారు. ఎమ్మార్వో శేషగిరి ఇరుపక్షాలకు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టి మే నెల 21 తేదీన ఎండార్స్మెంట్ రిపోర్టులో ఇరువురి దస్తావేజులు చూసి కోర్టు డాక్యుమెంట్స్ చూసి ప్రైవేట్ ల్యాండ్ కోర్టు వివాదంలో ఉందని తెలియపరిచారు.ఈనెల జూన్ 13వ తేదీన  ఎంఆర్ఓ గాయత్రి మరో అండర్స్మేంట్ నివేదిక బాధితులకు నోటీసు ఇవ్వకుండా తెలియపరచకుండా రాజనాల సాయికిరణ్ కి ఇచ్చి వేశారు. దీనితో అతను అది తీసుకువచ్చి నాకు ఎమ్మార్వో గారు స్థలం నాదే ఇచ్చారు రాసిచ్చారు అని నిర్మాణం చేపడతామని పోలీసుల అండతో కుటుంబానికి బాధ్యత కుటుంబానికి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. బాధితుడు షుకుర్ వేళ్ళి ఎమ్మార్వో ని అడగగా   మీకు కూడా ఒక కాపీ ఇస్తాము తీసుకువెళ్లండి అని అన్నారు. నాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మరో అండార్స్మెంట్ రిపోర్ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని బాధితుడు ప్రశ్నించగా సమాధానం దాటవేస్తున్నారు 23 రోజుల కాలవ్యవధిలో మరో రిపోర్ట్ ఇవ్వడం బాధితుడికి తెలియపరచకుండా రాజనాల సాయికిరణ్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ లో ఏ విధంగా మేనేజ్ చేశారు తెలియ వస్తుంది.ఎండార్స్మెంట్ కాపీ ఇస్తూ సర్వేయర్ విజయరాజు చదవకుండా సంతకం పెట్టి తీసుకువెళ్లాలని హుకుం జారీ చేశారని అన్నారు. అప్పటి నుండి తరచు ఈ వ్యక్తి మద్యం సేవించిన మనుషులను    ఇంటి వద్దకు తీసుకొని వచ్చి దుర్భాషలాడడం చంపేస్తామని బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నాడు ఇంట్లో నివాసం ఉంటున్న వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.గడచిన ఐదు రోజుల నుండి  రాజనాల సాయి కిరణ్ కుమార్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన కేసు నమోదు చేయడం లేదు.  రాజకీయ పలుకుబడి ధన బలంతో బాధితులు ఇస్తున్న ఫిర్యాదులను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కలెక్టర్ వెట్రి  సెల్వి, ఎస్పీ ప్రతాప్ కిషోర్ జోక్యం చేసుకొని మా కుటుంబానికి రక్షణ కల్పించవలసిందిగా బాధితుడు  అబ్దుల్ షుకుర్ భార్య మోబిన (8) సంవత్సరాల కొడుకు అబ్దుల్ సనాఫ్ (4) సంవత్సరాల కొడుకు అబ్దుల్ సమద్ అన్నలు అబ్దుల్ ముజీబ్ అబ్దుల్ రహమతుల్లా అబ్దుల్ హబీబ్ కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.