Connect with us

Andhra

కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా AVVIGO+ IVUS కన్సోల్ (Boston Scientific) ఏర్పాటు

Published

on

కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో Boston Scientific సంస్థ రూపొందించిన అధునాతన AVVIGO+ IVUS కన్సోల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ (ఇంట్రావాస్క్యులర్ ఇమేజింగ్) మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు.ఈ వ్యవస్థను కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డా. పర్వతనేని నాగ శ్రీ హరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. అకుల శివ ప్రసాద్ ల ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలందించడంలో ముందడుగు పడింది.AVVIGO+ IVUS సిస్టమ్ రక్తనాళాలలో జరిగే శస్త్రచికిత్సల సమయంలో అత్యద్భుతమైన స్పష్టతతో తక్షణ చిత్రాల ద్వారా వైద్యుల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా క్లిష్టమైన హృద్రోగ కేసుల్లో ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.“ఈ సాంకేతికత ద్వారా మేము కేవలం హృద్రోగాలను చికిత్స చేయడం కాదు — ఆంధ్రప్రదేశ్‌లో హృద్రోగ చికిత్స విధానాన్ని సమూలంగా మార్చుతున్నాం,” అని డా. నాగ శ్రీ హరిత తెలిపారు.ఈ ముందడుగు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి, సాంకేతికత ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంపై కిమ్స్ శిఖర హాస్పిటల్ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.