Connect with us

Andhra

జర్నలిస్ట్ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించలేమనడం బాధ్యతరాహిత్యం: ఏపీడబ్ల్యూజేఎస్

Published

on

ఏలూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య (ఏపీడబ్ల్యూజేఎస్) ఏలూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ షుకూర్ ఇంటి స్థలంలో నకిలీ దస్తావేజు తీసుకొని శుక్రవారం దౌర్జన్యంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసిన ఏలూరు టూ టౌన్ పోలీసులు బుట్ట దాఖలు చేయడంపై ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగుండ్ల రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్ర అధ్యక్షులు కాటా రామారావు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్.ముస్తఫా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మార్వో ఇరువురి దస్తావేజులు పరిశీలించి కోర్టు వివాదాల్లో స్థలం ఉందని ఎండార్స్మెంట్ ఇవ్వగా దానిని టూ టౌన్ సిఐ ఎమ్మార్వో సిఆర్పిసి 145 ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు మాట్లాడుతూ బాధితులకు రక్షణ కల్పించలేమని తెలపడం బాధ్యత రాహిత్యం అన్నారు. సీఐపై రాజకీయ నాయకుల ఒత్తిడో లేక ముడుపులు తీసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఎస్పీ ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో జర్నలిస్టులు అంతా ఏకమై పోలీస్ స్టేషన్ వద్ద, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామన్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు రాజనాల సాయికిరణ్ కుమార్ ని వివాదాస్పద స్థలంలో రానీయకుండా తగు చర్యలు తీసుకోవాలనివారు ప్రభుత్వాన్ని కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.