Connect with us

Andhra

ఏలూరులో మారణాయుధాలతో కబ్జా కోర్లు హల్ చల్

Published

on

80 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న జర్నలిస్టు కుటుంబానికి ప్రాణహాని

 

45 సంవత్సరాల నుండి కోర్టు వివాదాల్లో ఉన్న స్థలంలో కబ్జాకోరుల హడావిడి

 

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం

 

లంచాల ప్రభావము లేక రాజకీయ నాయకుల ఒత్తిడో

 

బాధితుల ఫిర్యాదును బుట్ట దాఖలు చేస్తున్న ఏలూరు టూ టౌన్ పోలీసులు

 

ఏలూరు జిల్లా ఏలూరు 20/6/2025: సుమారు 45 సంవత్సరాల పైబడి కోర్టు వివాదాల్లో ఉన్న స్థలానికి నకిలీ దస్తావేజు తీసుకువచ్చి ఈ స్థలం తనదని తరచూ వివాదానికి దిగుతున్న రాజనాల సాయికిరణ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి, రాజకీయ నాయకులతో సిఫారసు చేయించుకుని ఓ కుటుంబం పై దాడులకు దిగుతున్నాడు. ఏలూరు జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం సెంటర్ సామిల్ వీధిలో అబ్దుల్ ఘని లేటు s/o అబ్దుల్ కరీం లేటు s/o అబ్దుల్ రహమతుల్లా, అబ్దుల్ హబీబ్, అబ్దుల్ షుకూర్ సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ఓ పది మందితో మారణ ఆయుధాలు తీసుకువచ్చి ఈ స్థలం తనదాన్ని ఎవరైనా అడ్డు వస్తే నరికి వేస్తానని హెచ్చరిస్తున్నాడు. బాధితులు 112 ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ వచ్చి మారణాయుధాలతో వచ్చిన రాజనాల సాయికిరణ్ బాధితులను పోలీస్ స్టేషన్కు రమ్మనగా సాయికిరణ్ తాను రానని బంకు పట్టి కొని అక్కడే తిష్ట వేసుకుని బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.. గత వారంలో కూడా ఇదే విధంగా దౌర్జన్యం చేయడానికి వస్తే బాధ్యతలు 112 కు ఫిర్యాదు చేయగా అతనిని బాధ్యతలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కోర్టులో తేల్చుకోవాల్సిందిగా తెలిపారు. ఈ సందర్భంగా తరచూ గుండాలను తీసుకువచ్చి ఇబ్బంది గురి చేస్తున్న వ్యక్తిపై బాధ్యతలు అతనిపై ఫిర్యాదు రాసి ఇవ్వగా రసీదు ఇవ్వకుండా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసు వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 2001లో ఇదేవిధంగా బాధితులు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ప్రహరీ బాత్రూం లెట్రిన్ మంచినీటి బోరు జెసిబి తో పగలగొట్టారు. అప్పుడు కూడా టూ టౌన్ పోలీసులు వారు దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిని జెసిబి ని అదుపులో తీసుకొని రాజనాల సాయికిరణ్ అతనితోపాటు వచ్చిన వ్యక్తులను ఎవరిని అరెస్టు అరెస్టు చేయలేదు.బాధితులు టూ టౌన్ లో కంప్లైంట్ ఇవ్వగా దానిని పక్కన పెట్టారు. పై స్థాయి అధికారులు మందలించగా అప్పుడు దీనిపై పోలీస్ స్టేషన్ వారు కేసు కట్టారు.  ఎఫ్ఐఆర్ నెంబర్:851/2021 సిసి నెంబర్ 216/ 2023 కోర్టులో కేసు నడుస్తుంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.