Connect with us

Andhra

జగన్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం

Published

on

AP: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని చెప్పారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సినిమా డైలాగులను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘీక శక్తులను అదుపు చేస్తామని వెల్లడించారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.