Connect with us

Andhra

ఈ నెల 29న APWJS రాష్ట్ర కమిటీ సమావేశం :రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్. ముస్తఫా

Published

on

జూన్ 29-6-25 ఆదివారం, ఉదయం 10 గంటలకు గుంటూరు లోని ఫ్యాన్సీ కన్వెన్షన్ ఫంక్షన్ హాలు నందుజరుగుతుంది అని APWJS రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంగులూరు బుచ్చిబాబు, రాష్ట్ర ఇంచార్జి నాగేండ్ల మల్లిఖార్జున రావు, రాష్ట్ర మీడియా ఇంచార్జి కర్నాటి కోటేశ్వరరావు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్. ముస్తఫా, రాష్ట్ర అధ్యక్షులు కాటా రామారావు చౌదరి తదితరులు పాల్గొని తమ సందేశాలను వినిపిస్తారు అనీ ముస్తఫా తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల కోసం తమ యూనియన్ పోరాడుతుందని, సమాజంలో చైతన్యం కోసం జర్నలిస్టులకు పని చేస్తున్నారని వారిపై రాజకీయ నాయకులు గాని, వేరే ఎవరైనా గానీ ఏ రూపంలో నైనా అసభ్యకరమైన పదజాలాలు వాడిన, దూషించిన, ‘దాడి చేసిన అవమానించిన,వారిపై యూనియన్ లీగల్ సెల్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తూ,
తమ యూనియన్ లోని కుటుంబంలో ఏ ఒక్క విలేఖరికి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, దురదృష్టకరమైన ఆక్సిడెంట్ రూపంలో నైనా, విలేకరులు వృత్తి పరముగా ఆ వ్యక్తికి ఏ రూపంలో డ్యామేజ్ అయినప్పటికీ కూడా, ఏపీడబ్ల్యూజేఎస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటూ వారికి యూనియన్ ఇన్సూరెన్స్లను అమలు చేస్తే విధముగా ముందుండి వారి ప్రతి అవసరాలను తీరుస్తుంది అన్నారు.ఏపీడబ్ల్యూజేఎస్ కుటుంబంలో ఉన్న ప్రతి విలేఖరికి కులాలకు అతీతంగా ప్రతి కులము వారి ముఖ్యమైన పండుగల సందర్బంగా, వారి కుటుంబకు ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడానికి తమ యూనియన్ ముందు ఉంటుంది అని, గుంటూరులో జరిగే సమావేశానికిఈ రాష్ట్ర కమిటీ మాత్రమే హాజరుకావలెననీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ముస్తఫా తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.