Connect with us

Andhra

మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా భావించి కఠిన చర్యలు తీసుకోవాలి.. యంపీజే

Published

on

ఏ ప్రభుత్వం ఉన్న సమాజంలో జరుగుతున్న చీకటి కోణాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను భౌతికంగా హత్యలు చేయడం దుర్మార్గమని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ తీవ్రంగా ఖండించారు.

చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్ర జ్యోతి జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై భౌతిక దాడులు, హత్యలు చేయడాన్ని.. మీడియాపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా భావించి వారిపై కఠిన చట్టాలను ఉపయోగించి మరణం దండన పడేలా ప్రభుత్వాలు చూడాలని ఆయన కోరారు.

అలాగే ప్రజాస్వామికంగా రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులే రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్లుగా ప్రజలపై పెనుభారంగా మారి వారిని ఇబ్బందులను గురిచేయడం, ప్రభుత్వ వనరులను కొల్లగొట్టడం, రౌడీల్లాగా, మాఫియాను మించి వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై హత్యలు చేయించడం దుర్మార్గమని, ఇలాంటి వారిని రీకాల్ ద్వారా పదవులు పోయేలా కొత్త చట్టాన్ని తీసుకొని రావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టాలను తీసుకోవాలని షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.